"తమపై తమకు నమ్మకం ఉన్న కొందరు వ్యక్తుల జీవితమే ఆ దేశ చరిత్ర అవుతుందని " స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్పారు. ఆ వ్యక్తుల కోవకు చెందిన వారే పొట్టి శ్రీ  రాములు గారు. చరిత్రలో ప్రసిద్ది చెందిన కొందరి జీవితాలను పరిశీలించినపుడు పూవు పుట్టగానే పరిమళించినట్లు బాల్యంలోనే మేధావులుగా గుర్తింపు పొందారు . వంశాను గతంగా గొప్ప లక్షణాలు వారికి సంక్రమించి ఉంటాయి. విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యనూ అభ్యసించి విజ్ఞాన సముపార్జన చేశారు. వారు గొప్ప రచయితల క్షాను, వక్తలుగాను రానిమ్చాతంలో ఉన్నత స్థానాలను అలంకరిం చేందుకు మార్గం సుగమమైంది . ఉన్నత పదవుల లోని వ్యక్తులకు అనుగుణంగా ప్రవర్తించి వారికి తలలో నాలుక అయ్యారు. తమ భావాలకు పరిస్థితులతో ఘర్షణ ఏర్పడితే లౌక్యం ప్రదర్శించారు. అవి అన్ని వారి నాయత్వ లక్షణాలయ్యాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good