భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచన 'పథేర్‌ పాంచాలీ'. కలిమిలేములతో, కష్టసుఖాలతో, విషాద విస్మయాలతో, పసి కుతూహలాలతో, ఏదో తెలీని అనిర్వచనీయ అనుభూతులతో ఆశావహంగా ముందుకే సాగిపోతుండే మానవ జీవితాన్ని..సున్నితంగా స్పృశిస్తూ అతి సన్నిహితంగా, సహజత్వంతో మన కళ్ళముందు రూపుకట్టించే  రచన ఇది. రచయిత బిభూతిభూషన్‌ బంథోపాథ్యాయకు అపార కీర్తినీ, దీన్ని చలనచిత్రంగా మలిచిన సత్యజిత్‌రేకు అంతర్జాతీయ ఖ్యాతినీ ఆర్జించిపెట్టిన ఈ బెంగాలి  నవలను మద్దిపట్ల సూరి తెలుగులోకి అనువదించారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good