సాంఘీక జీవితం బ్రతుకుదెరువుకూ అనుభవాలకీ ఉపయోగపడుతుంది. ఒంటరితనం అనుభవాలను జీర్ణించుకోవడానికి వ్యక్తిగతాభివృద్ధికి ఉపయోగపడుతుంది అంటారు గోపీచంద్‌. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఈ తొలి తెలుగు నవల (1963)ను పునర్ముద్రించి 'అలకనంద' మంచి పనే చేసింది. - ఈనాడు

'గోపీచంద్‌' నవలలన్నింటిలోనూ ఈ నవల భిన్నమైనది. ఇలాంటి నవలను 'కొత్తతరాల' కోసం మరోసారి అందించిన 'అలకనంద' కృషి ప్రశంసనీయమైనది. - ఆంధ్రజ్యోతి

ఏ నాటికీ నిలచే నవల. మనిషి ఎలా ఉంటే సంపూర్ణ జీవితం గడపగలడో వివరించిన విశిష్ట నవల. ఆనాటి ప్రథమ తెలుగు నవల గుణగణాల్ని గుర్తుంచుకునేలా ఈనాటి పాఠకులకు అందజేసిన ప్రచురణకర్తలు అభినందనీయులు. - ఇండియాటుడే

తెలుగుదేశంలో రచయితల చుట్టూ అల్లుకున్న రాజకీయాలను ప్రతిభావంతంగా చిత్రీకరించిన నవల 'గోపీచంద్‌' రాసిన 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'. - వార్త

వివిధ పాత్రల మనోగతాల్ని ఆవిష్కరించే క్రమంలో వాటిని వారి వారి కథలుగా 'చెప్పించడం' ద్వారా నవల రాయడంలో ఒక నూతన మార్గాన్ని సూచించిన గోపీచంద్‌ సాహిత్య చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు. - ఆంధ్రజ్యోతి

గోపీచంద్‌ రచనా వైశిష్ట్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన వాటిల్లో పేరెన్నికగన్నది. ప్రముఖమైనదీ 'పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా'. గోపీచంద్‌ మరణానంతరం (1963) కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు నవలగా ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో సుస్ధిర స్థానం సంపాదించుకుంది. - సాక్షి

Write a review

Note: HTML is not translated!
Bad           Good