రచయిత గురించి
''తెలుగు కథకుల్లో ఎక్కువమంది మధ్యతరగతికి చెందినవారే అయినప్పటికీ రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారి సంఖ్య చాలా తక్కువ. అందువల్ల 'పంట పండితే పండగ - పండకపోతే ఎండగ'లా పైరు జీవనం సాగించే రైతులను గురించి వచ్చిన కథలు కూడా తక్కువేనని చెప్పాలి. కరుణకుమార, మా.గోఖలే, జమదగ్ని, కె.సభా లాంటి వారు ఈ విషయంలో గణనీయమైన కృషి చేసిన వారైనా అచ్చంగా కర్షక కుటుంబాలకు చెందినవారు కారు. ఇందుకు భిన్నంగా ఈ శతాబ్ది చివరి పాదంలో - కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచీ రైతుల జీవితంలోని వెలుగునీడలకు కథారూపం ఇవ్వగల రచయితలు తరతరాలుగా వ్యవసాయ జీవనానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కుటుంబాలలో నుంచీ వచ్చిన వారు సాహిత్యరంగంలో ప్రవేశించారు. అలాంటి రచయితల్లో శాంతి నారాయణకొక విశిష్ట స్ధానం కద్దు...

రాయలసీమ స్థితిగతులపైన ఒక థీసిస్‌ రాయడానికి కావలసినంత సరంజామాను శాంతినారాయణ ఈ కథల్లో పొందుపరిచాడనడం సత్యసమ్మతంగా వుంటుంది. సవ్యసాచిలా ఈయన - సామాజిక శాస్త్రజ్ఞులకూ భాషా శాస్త్రజ్ఞుల పరిశీలనకూ పని కల్పించాడు....''

Write a review

Note: HTML is not translated!
Bad           Good