''బతికి ఉంటే పామరుడ్ని'' చస్తే అమరుడ్ని'' అని చాటుకున్న శేషేంద్ర లొంగుబాటును సహించలేదు; ''నా అవయవాలకు నీచంగా వంగే / భంగిమలు తెలీవు'' అన్నాడు. కనుకనే మరో సందర్భంలో ఆయనే ''ఈ దేశంలో వంగేవాడికి / వంగి సలాం చేసేవాడు పుడుతున్నాడు / జాగ్రత్త! ఈ లక్షణం తలెత్తిందంటే ఆకాశంలో తోకచుక్క పుట్టిందన్న మాటే'' అని చరుపులు చరిచాడు! చేతిలో శతఘ్ని లేకపోవచ్చు గాని, మనిషి ''ఛాతీలో గుండె'' ఉంటే చాలని బోధించిపోయాడు! అంతేగాదు, సామాన్యుడు తుపాకుల్ని ఎదుర్కోగలరు గానీ నియంతలు మాత్రం ప్రశ్నల్ని ఎదుర్కోలేరని ఎద్దేవా చేశౄడు! ఇలా, ఆకులందున అణగిమణిగి కవితా కోయిల కూయవలెనన్న గురజాడ వారసత్వం బలంగా అబ్బినందున ''చెట్లు పూలెందుకు పూస్తాయి / బుల్లెట్లెందుకు పూయవు'' అనగలిగాడు శేషేంద్ర! కష్టజీవుల కన్నీటి బిందువుల్లో ''గర్జిస్తున్న సముద్రాలు'' చూసిన కవి ''ఆకులు కాదు. తుపాకులు కాయండ''ని చెట్లకు మొరపెట్టుకున్న వాడు! అశ్రువులతో తిరుగుబాటు'' కవి ఎవడంటే, 'కష్టజీవికి మొదలు చివర నిలబడిన వాడే కవి అని శ్రీశ్రీ తన గురించి చెప్పుకోగా, ''మరణించే లోపుగా తన మాట చెప్పలేని / నిస్సహాయ మానవుడి గొంతు పేరే కవి'' అంటాడు శేషేంద్ర! అంతేనా? దళితవర్గంలో భాగంగా అంబేద్కర్‌ భావించిన ''స్త్రీలో ఉన్న ప్రేమను పోలీసు / ఎంక్వయిరీ అప్పగించొద్దని చెబుతూ, 'వసంతంలో అడుగు పెడుతున్న వృక్షాన్ని పంటచెరుకుగా చూడకు'' అని బరువైన గుండెతో శేషేంద్ర పలుకుతాడు! నాగలి నాగరికతకు అనాది అనీ, సేద్యం సంస్కృతికి పునాది అనీ గుర్తించిన ఆయన ''మన ఉషస్సుల్ని పాతిపెట్టి మన దేశంలోనే మనల్ని బానిసలు చేసిన వాళ్ళ ప్రాణవాయువులు పీలుద్దాం'' రమ్మంటూ నాగళ్ళు తీసుకోమని రైతు సోదరుల్ని వేడుకున్నాడు కవి!

Pages : 155

Write a review

Note: HTML is not translated!
Bad           Good