హిందీ సినీ గీతాల రూపకర్తల సృజనాత్మకతను వివరించే విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. సినీ సంగీత సృజనలో మార్గ దర్శకులయిన సంగీత దర్శకులు, గేయ రచయితలు, గాయనీ గాయకుల సృజనను విశ్లేషించి ఆనాటి సినీరంగంలోని పరిస్థితుల నేపథ్యంతో సమన్వయపరచి సినీ సంగీత ప్రపంచంలో ఆయా కళాకారుల స్థానాన్ని, సినీ గీతాల అభివృద్ధిలో వారి ప్రభావాన్ని విశ్లేషించిన పుస్తకాలు అరుదు. అలాంటి అరుదయిన పుస్తకం ఇది. ప్రఖ్యాత కళాకారులతో పాటూ, అంతగా తెలియని ప్రాచుర్యంలోని లేని అరుదుగా వినిపించే కళాకారుల సృజనాత్మకతను వివరించే పుస్తకం ఇది. మొత్తం అరవై ముగ్గురు హిందీ సినీ సంగీత కళాకారుల సృజనను విశ్లేషించిన అరుదయిన పుస్తకం, పాడుతా తీయగా.

Write a review

Note: HTML is not translated!
Bad           Good