సంతలో ఒక బాలుడు కంబళ్ళను అమ్మకానికి పెట్టాడు. అవి బాగా ఖరీదైనవి. అందరూ చూసి వెళుతున్నారే గాని కొనడంలేదు. ఇంతలో ఒక వ్యక్తి వాటి దగ్గరకు వచ్చి వాటిని పరిశీలించాడు. ఆ కంబళ్ళు కచ్చితంగా తన స్నేహితుడు నేసిన కంబళ్ళేనని నిర్ధారణకొచ్చాడు అతను. కాని ఆ స్నేహితుడు అక్కడ లేడు. మరి ఆ కంబళ్ళు బాలుడి చేతిలోకి ఎలా వచ్చాయో తెలుసుకోవాలంటే 'రత్న కంబళి' కథ చదవాల్సిందే.

ఓ మిఠాయి దుకాణంలో మిఠాయిలు మాయమవుతుంటాయి. దానికి కారణం అక్కడి నౌకర్లలో ఒకరు! అతను మిఠాయిలను దొంగతనం చేయడు. కానీ, సమయం చూసి నోట్లో వేసుకుంటాడు. ఆ దొంగను పట్టుకునేందుకు యజమాని కుమారుడు ఎలాంటి పథకం వేశాడో తెలిస్తే మనం ముక్కున వేలేసుకుంటాము.

కుండీల్లో విత్తనాల్లోంచి మొలకలు వచ్చిన మరుక్షణమే పిచ్చుకలు వచ్చి తినేస్తుంటాయి. తన చిట్టి బుర్రతో పిచ్చుకలు వచ్చినా మొలకలు వైపుకు వెళ్లకుండా ఒక అబ్బాయి ఎలాంటి ఉపాయాన్ని అనుసరించాడో తెలుసుకుంటే, అతని పద్ధతి మనం కూడా అనుసరిస్తాం.

పేజీలు : 72

Write a review

Note: HTML is not translated!
Bad           Good