మనీ నుంచి మోక్షం వరకూ ఏది కోరుకుంటే అది మీదే....

ప్రత్యేకంగా ఏ మంత్రాలూ నేర్వకపోయినా, ఏ గురువునుంచీ ఉపదేశం పొందకపోయినా రుద్రాక్షను ధరించేవారు శివ పంచాక్షరీ మంత్రం 'ఓం నమ: శ్శివాయ' అనుకుంటే చాలు! పరమశివుడు పిలిస్తే పలుకుతాడు. కొలిస్తే గుండెలో కొలువైపోతాడు. తలచిన వారందరూ తనవారే అనుకుంటాడు బోళా శంకరుడు కదా!

శివుడు బూడిద పూసుకు తిరిగే వాడయినా, తనను నమ్మిన వారికి మాత్రం అష్టైశ్వర్యాలనూ ప్రసాదిస్తాడు. అవును. శివుడు ఐశ్వర్యకారకుడు గనకే కుబేరుణ్ణి నవనిధులకూ అధిపతిని చేయగలిగాడు. ఆ కుబేరుడి చరిత్రను కూడా ఈ పుస్తకంలో వివరించాను. చదవండి!

రుద్రాక్షల గురించి ఎలాగూ రాస్తున్నాను గనుక, వాటితోపాటు నవరత్నాలు, జాతి రాళ్లు, స్ఫటికాలు, మంత్ర తంత్రాలకు సంబంధించిన కొన్ని వివరాలను కూడా ఈ పుస్తకంలోనే కలిపి అందించడం సందరోభచితంగానూ, ఉపయోగకరంగానూ ఉంటుందనిపించింది. అందుకే ఆ విషయాలను కూడా చేర్చాను. మానవ ప్రయత్నానికి దైవానుగ్రహాన్నీ గ్రహానుకూలతనూ తోడు చేసే వారధులు, సారధులు అయిన వాటన్నిటి గురించీ ఒకే పుస్తకంలో తెలుసుకునే అవకాశం కల్పించటమే ఈ పుస్తకం ఉద్దేశ్యం! - ఓంకార్‌

Pages : 292

Write a review

Note: HTML is not translated!
Bad           Good