జీవితంలో ఎదురయ్యే ఆయా సమస్యల పరంగా, అనుభవ ప్రగాఢతలోంచి పుట్టుకొచ్చే కథలు రాయాలంటే 'వస్తువు' భాష శైలి, శిల్పం లాంటి మౌలికాంశాలపట్ల సరైన అవగాహన అవసరం. అంతస్సూత్రంగా రాజకీయ - సామాజిక అధ్యయనం చేరవలసిన దిశను సూచిస్తుంది. కేవలం ఏదో కాలక్షేపానికి కాస్సేపు గిలిగింతలు పెట్టి మరిపించే కథానిక రచన - వస్తు వినిమయ ప్రపంచంలో ఒక కన్‌జ్యూమర్‌ దినుసుగా వాణిజ్య సరుకుగా పనికొస్తుంది. కానీ ఈ వ్యవస్థలో మనిషి జీవితంలోని వివిధ కోణాల నుంచి ఆయా సంఘటనలు - సన్నివేశాల నేపథ్యంలో తాత్వికంగా 'నిజాన్ని' అన్వేషించే కథారచన కత్తిమీద సాములాంటిది.

ఈ ఇరవై రెండు కథల్లో నేను విప్లవ పోరాటానికి, మన విద్యావ్యవస్థకు, మధ్యతరగతి సమస్యలు, స్త్రీపురుష సంబంధాలు, యుద్ధం, మతం, భూమి సమస్య, విదేశీ జీవితానికి సంబంధించిన ఇతివృత్తాలు ఎన్నుకొన్నాను. వీటిని ఏమేరకు ఉత్తమ కథానిక స్థాయికి తీసుకెళ్ళ గలిగానో విమర్శకులు - పాఠకులే నిర్ణయించాలి.- నిఖిలేశ్వర్‌

పేజీలు : 148

Write a review

Note: HTML is not translated!
Bad           Good