''ఒక తల్లి బిడ్డలు'' కథలో ఇర్ఫాన్‌ పడే ఆరాటం... అన్ని మతాల వాళ్ళు సామరస్యపూర్వకంగా బతికితే బావుండునన్న కోరిక... తను ముస్లిం ఐనా క్రిస్టియన్‌ స్నేహితునితో కలిసి చర్చికెళ్ళి ప్రార్థనలు చేయడం, హిందూ స్నేహితులతో కలిసి దేవాలయానికెళ్ళటం... రచయితలో బలంగా వేళ్ళూనుకుని ఉన్న ఆదర్శాలకు అద్దంలాంటిదీ కథ.''మనమంతా ఈ మట్టిలో పుట్టి ఈ మట్టిలో బతుకుతున్న వాళ్ళమే. ఎదుటివాడ్ని చూడగానే చాకలి, మంగలి, సాలె, కంసాలె, మాల, మాదిగ లాంటి భావనలు రాకూడదు. అందరూ అన్నదమ్ములన్న భావన రావాలి. ప్రశ్నించడమే ఒక పోరాటం. మనం ప్రశ్నించకపోవడం వల్లనే ఇలా ఉన్నాం. దళితులు, వెనుకబడిన తరగతుల వారిని లొంగదీసుకోవడానికి చేసే ఎత్తుగడలు ఫలించ కూడదు'' అంటాడీ కథలో.

ఈ కథలన్నింటిలో విస్తారంగా కన్పించే లక్షణం మానవత్వం. పాత్రలన్నీ మంచితనంతో, ఔదార్యంతో, మానవత్వంతో మనుషుల్లా ప్రవర్తించటం ఈ కథల్లోని ప్రత్యేకత. 'పూలజడ' కథలో హసీనాకు బుట్టెడు పూలిచ్చిన ఆరిఫ్‌, '¬రుగాలి' కథలో రహీం, ''నేస్తం నీ గురుతు'' కథలో శివసాగర్‌, షాజహాన్‌, ఫాతిమా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్‌ తేలుతుంది. 

''నేస్తం నీ గురుతు'' కథలో ఓ హిందూ కుటుంబంతో ముస్లిం కుటుంబానికున్న గాఢమైన మైత్రీ బంధాన్ని హృదయానికి హత్తుకునేలా చిత్రించారు. 'జై ఇన్సాన్‌' కథ నిండా మానవత్వపు పరిమళాల గుబాళింపు ఉంది. దుర్మార్గుడైన సెక్షన్‌ సూపర్నెంట్‌లో అతని చేత పీడించబడిన కరీం జాన్‌లు తమ మంచితనంతో మార్పు తీసుకురావటం కథాంశం.

'చాంద్‌' కజథలో అనాధ ఐన బషీర్‌ని అక్కున చేర్చుకున్న యాసిన్‌ మాటల్లో ముస్లిం సమాజం మీద రచయితకున్న సంవేదన స్పష్టమౌతుంది.

... ఇలా పూలజడ, ¬రుగాలి, నేస్తం ! నీగురుతు!!, జై ఇన్సాన్‌, బీబీ అమ్మ, ఒక తల్లి బిడ్డలు, మకిలి అంటని చేతులు, వెనకీధి కుర్రాళ్ళు, కాళికనాలిక అనే 10 కథలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

Pages : 134

Write a review

Note: HTML is not translated!
Bad           Good