అధికార హోదాల్లో ఉన్నవాళ్లో, ప్రముఖ నాయకులుగా చెలామణి అయినవారో మరణిస్తే, వాళ్ళనందరూ గుర్తుపెట్టు కుంటారు. వాళ్ళ జీవితాలు ఎక్కడో చోట రికార్డు చేయబడతాయి. కానీ ఉద్యమాలలో పనిచేసే కార్యకర్తలను చరిత్ర అంతగా గుర్తుంచుకోదు. ఎందుకంటే వీరిలో చాలామంది తమంతట తాము సాహిత్య సృష్టి చేసిన వాళ్ళు కాదు. అలాగని ఇతరులెవరైనా వాళ్ళను గురించి రాసేంత ప్రముఖులుగా గుర్తింపబడిన వాళ్ళూ కాదు. సీకే ఈ రెండో కోవకు చెందిన వ్యక్తి.

    సీకే నారాయణరెడ్డి (1925-2013) నిశ్శబ్దంగా పని చేసుకుంటూపోయే గొప్ప పనిమంతుడు. తలకెత్తుకున్న విలువలను తనువు చాలించేదాకా నిలబెట్టుకున్న కమ్యూనిస్టు. హైదరాబాద్‌ బుక్‌ ట్రస్టు వ్యవస్థాపకులలో ఒకరు. అతిసాధారణంగా కనిపిస్తూనే గొప్ప మార్పు కోసం జీవిత పర్యంతం శ్రమించిన ఇటువంటి మౌన ఋషుల,ర మానవతా మూర్తుల చరిత్ర బయటకు రావటం అవసరమని భావించి ఈ పుస్తకాన్ని ప్రచురించడం జరిగింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good