సకల దుర్గముల నాశిని, సకల ఐశ్వర్య ప్రథాయిని, అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ దివ్య రహస్యాలు సరళంగా, విపులంగా తెలియజేసే అద్భుత గ్రంథం 'నవ దుర్గా నిధి'.

''దుర్గా'' అన్న పదమునకు అమరకోశంలో ఇరవై ఒక్క అర్ధాలు చెప్పబడ్డాయి. కనుక ఈ 21 రూపాలలో ఏవిధంగా కొలచినా ఆ అమ్మ సంతోషిస్తుందని పండితుల వాక్య సారాంశం. దానిని గ్రహించే ఉమ, కాత్యాయని వంటి అమ్మ రూపాలను కూడా ఈ పుస్తకంలో స్థుతించటం జరిగింది.

దుర్గను ''భవానీ''గా ఎందుకు స్థుతిస్తారు అన్న ప్రశ్న దగ్గర మొదలైన ఆలోచనలు ఈ పుస్తకం వ్రాయడానికి ఒక కారణం అయితే దుర్గాదేవి అవతారములలో (దసరా) ఉత్తరాదికి, దక్షిణాదికి భిన్నత్వం ఎందుకు కన్పిస్తుంది అన్న ప్రశ్న మరొక కారణం. ఈ రెండు కారణములు ఈ ''నవ దుర్గా నిధి''కి ప్రారంభ వాక్యాలుగా చెప్పుకోవచ్చు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good