ఒక ప్రాంతం విముక్తి కోసం పనిచేయటం, ఒక ప్రాంతం అస్తిత్వం కోసం పోరాడటం, వెనుకబడిన ప్రాంతం, వెనకబడిన వర్గాల హక్కుల కోసం, వారి పక్షాన నిలబడటం కంటే ఉన్నతమైనది మరొకటి లేదు. తెలంగాణ ప్రాంత అస్తిత్వ పెనుగులాట పోరులో పనిచేయడం మరిచిపోలేని అనుభూతి. తన నేల విముక్తి కోసం తన నేలపై తన పాలన, తన నేలపై ఇతర ప్రాంతాల ఆధిపత్యాన్ని ధిక్కరిస్తూ ముందుకు సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన ఉధ్యమంలో నారాయణ క్రియాశీలకంగా పాల్గొన్నారు. అందుకే కె.నారాయణ నడిచిన దారి పోరుదారి అయ్యింది. సిపిఐ కొనసాగించిన తెలంగాణ పోరుబాటలో నారాయణ సురక్షితుడైన సైనికుడయ్యారు.
నా తెలంగాణా అంటూ
రాష్ట్రం వచ్చేదాకా నినదించిన నారాయణ
తెలంగాణా చెలికాడు
ఈ మట్టిని ఒంటికి రాసుకుని
ఎరుపెక్కిన తెలంగాణ ఉధ్యమకారుడు

Write a review

Note: HTML is not translated!
Bad           Good