ఆధునిక తెలుగు కధా సాహిత్యంలో వీరిదొక ప్రత్యేక స్తనం. కధా నిర్వహణలో వినూత్నమైన పంధాను ప్రవేసపెట్టారు. వ్యంగ్యం - పేరడీలన్నకళ్ళతో అవి నడుస్తాయి. పడాల విరుపు, కొత్త కొత్త పడాల ప్రయోగాలన్న చేతులతో పాఠకులను అక్కున చేర్చుకుంటాయి వారి కథలు. రమణగారి చూపుకో ప్రత్యేకత ఉంది. ఆ కళ్ళతో వారి కథలు లోకాన్ని చూస్తాయి. టీన్ఏజ్  వాళ్ళ ఆలోచనలు గానీ, రాజకీయాల రణరంగంకానీ, అప్పులివ్వడం, తీసుకోవడం అన్న అంశాలుకానీ వస్తువులుగా తీసుకున్నపుడు వాటన్నిటికీ ఒక చక్కని దార్శనికతను తాయారు చేసుకుంటారు. వాటి కనువైన పదజాలాన్ని సృష్టించుకొంటారు. వాటి ఆధారంగా అనుకూలమైన వాతావరణాన్ని తాయారు చేసుకుంటారు.
సాధారణంగా రమణగారి కథల్లోని వస్తువులు సార్వకాలికాలుగా ఉంటాయి. అందుకే ఆ కథలు ఎప్పటికప్పుడు నిత్యనూతనం అనిపిస్తాయి.రచయితలు సామజిక మార్పును ఆశిస్తారు. అందుకు తమ రచనల ద్వారా తమ పాఠకవర్గాన్ని మేల్కొల్పాలని కృషి చేస్తారు. అలాగే రమణగారి పాఠకులు మధ్య తరగతి వర్గం. రమణగారు ఆసించిన మార్పు - ఏ యే సామజిక తత్వికతలతో, ఎక్కడ రావాలో పాఠకులకు - ఇదిగో ఇక్కడ...ఇక్కడ అంటూ పదేపదే చూపిస్తారు తమ కథల్లో. కింది తరగతుల వాళ్ళకు తెగింపుతో పనులు సాధించుకోగలమన్నధైర్యం ఉంటుంది. ఉన్నత వర్గాలకు డబ్బే అన్నీ సాధించి పెడుతుందన్న ధీమా ఉంటుంది.  ఈ రెండూ లేక కలలు భోంచేస్తూ, ఎవరన్నా తడ్తే తప్ప లేవలేనిది మధ్య తరగతి. ఆ మధ్య తరగతిలో సామజిక చైతన్య స్ఫూర్తి కలిగిస్తే సామజిక రుగ్మతలు కొంతవరకన్నా తగ్గవచ్చని రమణగారి రచనాధ్యేయం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good