చిన్నతనంలో పిల్లల్ని సత్ప్రవర్తన, వివేచన, విచక్షణ, క్రమశిక్షణలతో తీర్చిదిద్దగలిగితే  ఉత్తములుగా ఎదుగుతారు. మాటలకంటే సరళసుందరమైన పాటలు, పద్యాలు పిల్లల మనసుల్ని బలంగా హత్తుకొంటాయి. బాలల ఆత్మస్థాయిని ఉన్నతోన్నతంగా పెంచుతాయి.

బడికి వేళ కేగి పాఠాలు వల్లించి

క్రొత్తవాని నేర్చుకొనగ వలయు;

క్రమము తప్పకుండ శ్రమజేసితేనియు

వృద్ధి పొందగలవు ముద్దుపాప!


కోరరాని వెన్నొ కోరికల్‌ గోరుచు

పెద్దవారి కష్ట పెట్టవలదు;

ఉన్నదానిలోన మిన్నగ నిత్తురు

పెద్దవార లెపుడు ముద్దుపాప!


కొంత మంది నలుపు కొంద రెఱ్ఱనివారు

ఎన్ని రంగు లెవరి కున్న నేమి?

బుడతలంద రొక్క పూదోట విరిసిన

పూలవంటి వారె - ముద్దుపాప!

ఇలా విద్యార్థులకు నైతికమైన, సందేవౄత్మకమైన, సుబోధకమైన, వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేయగల సూక్తులు ఈ పుస్తకం నిండా నిండారి వున్నాయి.

Pages : 24

Write a review

Note: HTML is not translated!
Bad           Good