తెలంగాణా జనజీవనం - నిజాంపాలన నాటి తదనంతర రైతాంగ పోరాటం, నాటి సామాజిక, సాంస్కృతిక,  ఆర్థిక అంశాల నేపథ్యంలో - దాశరథి రంగాచార్య రూపు కట్టించినట్టు మరే రచయితా చిత్రించలేదన్నది సత్యం. చారిత్రకంగా జరిగిన సామాజిక పరిణామ దశల్లో జనశ్రేణులు ఎలా స్పందించిందీ, తమ సాంస్కృతిక స్వేచ్ఛ కోసం ఎలా నిరసన తెల్పిందీ, రాజకీయ అస్తిత్వం కోసం ఎలా ఆందోళన, తిరుగుబాటు, ప్రతిఘటనలు చేసిందీ - చివరకు భూమికోసం, భుక్తికోసం, భాషకోసం, వెట్టిచాకిరి అంతంకోసం, నిజాం పానను తుదముట్టించటంకోసం ఎలా సంఘటించి పోరాడిందీ 'దాశరథి రంగాచార్య రచనలు' నేటితరానికి కళ్ళ ముందు కదలాడేలా చేస్తాయి.

చిల్లరదేవుళ్ళు, మాయజలతారు, మోదుగుపూలు, జనపథం వంటి నవలలు - 'చరిత్ర నిర్మాతలు జనం' అన్న సత్యాన్ని వెల్లడిస్తాయి. వీరి రచనలు జనం భాషలో గుండెలను పలకరిస్తూ, మెదళ్ళకు పదునుబెడ్తాయి. వీరి రచనలు అనేకం ఇతర భారతీయ భాషల్లోకి అనువాదమయ్యాయి. కొన్ని చలన చిత్రాలుగా కూడా వచ్చాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good