బతుకు గోరే తల్లి సరోజత్త

''ఇందాక నా కూతురు నోరంతా తెరిచి అడిగితే ఇరై రూపాయలు లేదన్నారు గదా.  ఇప్పుడే ఇన్నూర్రూపాయలెత్తుకోని తిరప్తికి పోతుండా.  నా మనవరాలు - అదే దాని కూతురు - అడుగు తీసి అడుగేస్తా వుండాది గదా.  ఈ ప్రాయంలో దానికి యెండి గొలుసులు కావొద్దా?''

ఎర్రని ఎండలో మా అమ్మ కడుపు

మా పలుకొటం అయ్యోరికి గెడారం వుండేది గాదు.  ఆయన కుడి చేతి మణికట్టు మీద ఒక వాత వుండేది.  మా పిలకాయల్లో శానా మంది మణికట్లకు అటువంటి వాతలు వుండాయి.

పిలకాయలు-అని అన్నాక, వాళ్ళు మట్టిలో ఆటలాడుకోకుండా వుండలేరు గదా.  మట్టి తినని పసి పిలగాడు- పసి పిలగాడే గాదు గదా.  పసితనంలో మట్టి తింటే పసికర్లు వస్తాయని, అవిట్ని రాకుండా చేసేటందుకు మాకు ఆ వాతల్ని పెట్టిస్తారు మా పెద్దోళ్ళు.  మా సిత్తూరు జిల్లా సెంద్రగిరి తాలూకాలో కొటాల అనే గ్రామం వుండాది.  ఇటువంటి వాతలు పెట్టడంలో ఆ వూరు పెక్కాసి పొందింది.  సూడబోతే, మా అయ్యోరికి కూడా కొటాల వాత తప్పలా.

మా ఇస్కూలు పిలకాయలం సాటుమాటుగా అనుకుంటాం: ''ఒరే, అయ్యోరు కూడా సిన్నప్పుడు మట్టి తిన్నాడ్రో'' అని-

సేతికి గెడారం లేని మా అయ్యోరు - ఒరే గెంట పదకొండున్నర అయిందేమో వూళ్ళోకి పోయి చూసేసి రండ్రా - అనేవోడు.  ఆ మాట అయ్యోరి నోట ఎప్పుడొస్తాదా - అని మేమంతా కాపెట్టుకుని వుండేటోళ్ళం.  మా వూర్లో ఒకరిద్దరి సేతికి తెల్లటి కప్పల మాదిరి గెడారాలు వుండాయి.  కానీ వోళ్లు ఆ సమయానికి ఇంట్లో వుండరు గదా.  మా వూళ్లో పెర్మినెట్టు గెడారం ఒకటుండాది.  అది మా వూరి వి.ఎల్‌.డెబుల్యూ ఇల్లు.  (ఆయన మా మేనత్త కొడుకే.)....

Write a review

Note: HTML is not translated!
Bad           Good