తిరుప్పావై – దివ్యపబ్రంధం  మేలుపలుకుల మేలుకొలుపులు
బాపు, రమణల అద్భుత సృష్టి ఈ కళాఖండం.
రమణగారి అక్షరాలు ఆకృతిదాల్చి బాపు బొమ్మలుగా మారతాయి.
ఇక్కడ బాపు బొమ్మలు అక్షరాకృతిదాల్చి రమణగారి గేయాలుగా మారాయి.
గోదమ్మతల్లి తన్మయంగా, అమాయకంగా పాడిన పాటలు తిరుప్పావై దివ్యభక్తికి సంకేతం.
తమిళంలో తిరుప్పావై  దివ్యప్రబంధంగా వెలుగొందుతున్న గోదమ్మపాటలకు
బాపు గీసిన బొమ్మలు రమణగారిని కదిలించాయి.            అంతే!
ఆయన అచ్చతెలుగులో గోదమ్మ పాటల్ని పాడుకోవడం ప్రారంభించారు.
తానే గోదాదేవై తిరుప్పావైని తెలుగు గీతాలుగా కూర్చారు.
స్వచ్ఛత ప్రమాణంగా పొంగిన కవితావేశం ‘మేలుపలుకుల మేలుకొలుపులు’గా రూపుదాల్చింది.
ఓ అజరామర కళాఖండమై మన ముందు నిలిచింది.
కళ్ళద్దుకొని, గుండెలకు హత్తుకోండి.
బాపు, రమణలతో కలిసి మీరూ పాడుకోండి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good