సంపూర్ణ వ్యక్తిత్వ మనోవిహాసమే విద్య , యవ్వనం మొగ్గ తొడిగి వ్యక్తిత్వం పరిపూర్ణంగా ఎదిగే సమయంలో విద్యార్ధులకు సంబంధిత అంశాలన్నిటిని మీదా అవగాహన అవసరం. బాధ్యత గల వ్యక్తిగా ఎదగడానికి, జీవన సమరానికి సంసిద్దమవడానికి ప్రతి విద్యార్ధికి సానుకూల దృక్పధం ఏర్పరచాలి. ఇందుకు ప్రముఖ కెరీర్ స్పెషలిస్ట్ సినియర్ పాత్రికేయులు శ్రీ వాసవ్య గారు రాసిన ఈ పుస్తక రచన కృషి చేసింది. నేటితరం విద్యార్ధులు బిన్న బిన్న బాద్యతల మధ్యన సమర్ధ వంతంగా విద్యార్ధి జీవితాన్ని గడిపేందుకు అవసరమైన అంశాలన్నిటినీ చర్చిచిన ఈ పుస్తక రచన మానసిక వికాసానికి కూడా సహకరిస్తుంది. తెలుసుకున్న / నేర్చుకున్న విషయం ఏదీ వృధా పొడన్నది జిజ్గాస, అనుకున్న కెరీర్ వైపుకు అడుగులు వేయాలన్న స్పూర్తిని ఈ పుస్తకం అందిస్తుంది. విద్యార్ధులందరికీ ఈ పుస్తక రచన ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. విపరీత ధోరణిలో ఎవరెవరో చెప్పిన కొటేషన్లతో , పిట్టకథలతో పుస్తకాన్ని నింపకుండా, తాము స్వయంగా ఏం చెప్పదలచుకున్నారో , దానిని స్పష్టంగా , విపుల రీతిలో చెప్పిన ఈ పుస్తక రచయిత కృషి ణి పాఠకులే అంచనా వేయాలి. ఈ పుస్తంలోని శీర్షికలలోని అంశాలన్నిటినీ ఒకే సారి చదవకుండా కొద్దిపాటి విరామమిస్తూ చదవండి. చదివిన దానిని జీర్ణించుకోండి. ఈ పుస్తక రచన పాఠకులకు ఉపయోగపడగలదని మా ప్రగాఢ నమ్మకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good