మాక్సిమ్‌ గోర్కి రచించిన అమ్మ నవల జగత్‌ ప్రసిద్ధి గాంచింది. 20వ శతాబ్ది తొలి ఏళ్ళలో వెలువడిన ఆ నవల దేశ, విదేశాల్లో అసంఖ్యాకులైన శ్రామిక జన శ్రేయోభిలాషులను, శ్రామిక జనులను కష్టజీవుల ఉద్యమాలలోకి ఆకర్షించడంలో, చైతన్యవంతులను కావించడంలో అనన్యమైన పాత్ర వహించింది. ఆనాటి నుండి ఈ నవల అదే పాత్రను పోషిస్తూ వస్తున్నది. దోపిడీ వ్యవస్థ కొనసాగినంత కాలం అది ఆ పాత్రను నిర్వహిస్తూనే ఉంటుంది. అలాంటి మహత్తరమైన నవలను బొమ్మల కథ రూపంలో అందించడానికి వీలుగా క్లుప్తంగా సాహిత్యాన్ని అందించాడు బాలల రచయిత శాఖమూరి శ్రీనివాస్‌. ఆ సాహిత్యానికి అపురూపమైన చిత్రాలను అందించాడు తుంబలి శివాజి. ఈ చిత్రకథనం దాదాపు రెండేళ్ళ క్రితం ప్రజాశక్తి దినపత్రికలో ధారావాహికగా ప్రచురించబడింది.

Pages : 70

Write a review

Note: HTML is not translated!
Bad           Good