వందేళ్లక్రితం ప్రజలు మాట్లాడే భాషవేరు. గ్రంథాల్లో భాష వేరు. వ్యవహారిక భాషలో పుస్తకాలు వ్రాయడం ఒక పెద్ద తప్పుగా కూడా భావించేవారు. అటువంటి సమయంలో వాడుక భాషలో, ఇంట్లో పని పాటలలో అలసిపొయ్యే సామాన్య స్త్రీ జనం సైతం స్వయంగా చదువుకొని ఆనందించగల చిన్న చిన్న నవలలు వ్రాసి సనాతులతో శతపోరు సలిపి, చివరికి పండిత ప్రకాండులతో సైతం ''భేష్‌'' అనిపించుకొన్న రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహారావు. గ్రాంథిక భాషవల్ల సామాన్య ప్రజలకు లోపిస్తున్న సాహితీ పిపాసను, వ్యవహారిక భాషతో పెంపొందింప జేయడానికి తన జీవితాన్ని వెచ్చించిన మహా రచయిత కొవ్వలి.

తెలుగుజాతి వున్నంత మేర, తెలుగుగాలి సోకినంత దూరం, తెలుగు అక్షరాలు నేర్చిన వారిలో కొవ్వలి రచనలు చదివి ఆనందించనివారు, అభినందించని వారు లేరనడం అతిశయోక్తి కాదు.

''మంత్రాలయ'' కొవ్వలి వారి కలం నుండి వెలువడిన 1000వ నవల.

పేజీలు : 228

Write a review

Note: HTML is not translated!
Bad           Good