నిశ్చేష్టులై చూస్తూండిపోయారు. ఇంత ఆధ్యాత్మికంగా నిగ్రహంగా కనబడిన మాత వెనుక జీవితం., ఇంత సంక్లిష్టభరితం అనుకునేసరికి వారిరువురికీ ఆమె మీద అపారమైన ఆత్మీయత పుట్టుకొచ్చింది.
'చెప్పండి మాతా! సంకోచించకండి. ఇప్పటివరకూ మీ సేవచేసుకుని తరించడమే మా భాగ్యం అనుకున్నాం. ఇకనుంచీ మీ కోసం మా ప్రాణాలర్పించడానికైనా మేం సిద్ధం' ఇద్దరూ ఆవేశంగా ప్రతినపూనారు.
స¬దరుల్లా తనకోసం తపనపడుతున్న ఆ ఇద్దరి వంకా ఆప్యాయంగా చూసింది ఆమె. 'ఇంకో వారంలో మనం ఇక్కడ నుంచి ప్రయాణం అవుతాము. రోజూ ఉదయం సమయంలో ధ్యానానికి అవసరమైన ఏర్పాటు వుండేలా మజిలీలు చేసుకోవాలి. అప్పుడే నేను నావేవ్‌లెంగ్త్‌ని అతని వేవ్‌లెంగ్త్‌తో అనుసంధానించి అతన్ని కలుసుకోవడానికి వీలు కలుగుతుంది. మధ్యలో అవాంతరాలు ఏర్పడే కొద్దీ అతన్ని కలుసుకోవడమూ ఆలస్యమవుతుంది.' ఆందోళనగా అందామె.
'మీకెందుకు మాతా! మీరు నిశ్చింతగా వుండండి. ఆ ఏర్పాట్లన్నీ మేం చూసుకుంటాం. మీకు కావలసిన వ్యక్తిని మీరు చేరుకుంటారు. అందులో ఎటువంటి సందేహమూ లేదు'. అభయం ఇచ్చారు వాళ్ళు.
శిష్యులు బయటకు వెళ్ళగానే కంప్యూటర్‌ ఆన్‌ చేసి, అందులో కన్పిస్తున్న ఫోటో వంక చూడసాగింది.
తను తన గతజన్మలోకి ప్రవేశించి, అక్కడ అతని యొక్క ఆత్మతో తన ఆత్మను అనుసంధానించి, అతని ద్వారా తెలుసుకున్న వివరాలతో రూపొందించిన ఊహాచిత్రమది. ఆప్యాయంగా స్క్రీన్‌ మీద కన్పిస్తున్న ఫోటోలోని చెంపల్ని నిమిరింది. యుగాల విరహానికి సాంత్వన చేకూరినట్లయింది.
పూర్వజన్మప్రియురాలు ఈ జన్మలో నీ భార్యనంటూ వస్తే ఈ జన్మ ప్రియురాలేమయిపోతుంది? - సూర్యదేవ రామమోహనరరావు రాసిన 'మానవయజ్ఞం' నవలలో ఉంది ఆ ప్రశ్నకు సమాధానం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good