అనూరాధ కథారచన పందొమ్మిది వందల ఎనభైల్లో ప్రారంభించినట్లు తెలుస్తుంది. ఎనభయ్యో దశకం స్త్రీల ఆలోచనలకు పదును పట్టినకాలం. ఎనభయ్యో దశకంలో పత్రికలలో స్త్రీలకు కేటాయించిన పేజీల్లో, వారికి సంబందించిన సమస్యలపై చర్చలూ, స్త్రీల సమస్యలను, స్త్రీల అభిప్రాయాలనూ పట్టించుకుని వ్రాసిన వ్యాసాలూ కవితలూ వుండేవి. ఇప్పుడవి బంగారపుకొట్ల స్థాయికి వచ్చాయి. ఒక్క కుదుపుతో బండిని వెనక్కి తిప్పినట్లయింది. ఈ తిప్పింది మార్కెట్ విశ్వకర్మ.

మార్కెట్ మానవసంబంధాల్లో మార్పు వచ్చింది. సమిష్టి సౌఖ్యం గురించికాక వ్యక్తి సౌఖ్యం గురించి మాట్లాడి సకల జనులనూ ఒప్పించగలుగుతోంది. ఒప్పుకోకతప్పదని శాసిస్తోంది. వివాహాన్ని గురించి, మాతృత్వాన్ని గురించి, సహజీవన సౌందర్యాన్ని గురించి పెంచుకున్న అవగాహనను కూడా వస్తు వినిమయ సంస్కృతి మింగేసింది. ప్రేమకు నిర్వచనం మారింది. ఈ మార్పు మనకి అనూరాధ కథల్లో కనిపిస్తుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good