''ఏ ఖర్చూ చెయ్యకండి. తాగుడు, వేశ్యలు, కట్నాలు, జూదం... ఇవన్నీ మాని డబ్బు కూడపెట్టండి.' అని బిగ్గరగా అని : కంఠం మార్చి మెల్లిగా, 'అదంతా నా వొళ్ళో పొయ్యండి.' అంటోంది సినీమా - గుడిపాటి వెంకటచలం

ఒక సగటు మనిషిగా నేను సంతృప్తిగా ఉన్నాను. కానీ, ఒ సృజనశీలిగా మాత్రం నాకు సంతృప్తి లేదు. అసలు సిసలు సృజనశీలికి ఎప్పుడూ సంతృప్తి ఉండదు. సృజనాత్మకత కళాకారుడు నిత్యం అసంతృప్తిలోనే బతకాలి. లేదంటే జీవితంలో ఎదుగుదల అక్కడితో ఆగిపోతుంది. - కె.విశ్వనాధ్‌

ఆ కోటలు యుద్ధాలు రాజులు నన్ను సమ్మోహితులను చేసేవి. నేను ఈ కథలు చదవడమే కాదు, వాటిని నాకు నచ్చినట్టు నా స్నేహితులకు వినిపించేవాణ్ణి. - రాజమౌళి

1987-88 సంవత్సరాలలో, సబిత అనే ఒక గిరిజన యువతి, ఒక నాగరికుడి చేతిలో మోసపోయి, చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఉషాకిరణ్‌ మూవీస్‌ యూనిట్‌ ఈ కథను సిద్ధం చేసుకున్నారు. ఆత్మగౌరవం కాపాడుకోవడం కోసం ఒక గిరిజన యువతి, విల్లంబులు చేపట్టి పోరాటం చెయ్యలేదు. మహాత్మాగాంధీ జాడల్లో సత్యాగ్రహం చేసింది. అదే మౌనపోరాటంగా మారింది. - పరుచూరి గోపాలకృష్ణ

కథ-నాటకం-సినీమాలలో మూడింటిలోనూ కథ ఉంది. కథా కధనం ఉంది. ప్రక్రియ పరిమితులున్నాయి. స్వరూప స్వభావాలలో విభేదం ఉంది. వైరుధ్యం ఉంది. గొప్ప నైపుణ్యం ఉంది. ఒడిసి పట్టుకున్న నేర్పరి చేతుల్లో అది మంత్రదండం అయ్యే అవకాశం ఉంది. లొంగకపోతే వెర్రివాడి చేతిలో గురితప్పే రాయి అయ్యే ప్రమాదమూ ఉంది. వెరసి-కథ, నాటకం, సినీమాలలో కథ మనిషీలో 'ఆత్మ' లాంటిది. వెదికితే దొరకదు. కాని లేకపోతే వాటి అస్తిత్వమే లేదు. - గొల్లపూడి మారుతి రావు

పేజీలు : 215

Write a review

Note: HTML is not translated!
Bad           Good