శ్రీశ్రీ ప్రచండమైన వేగంతో అభ్యుదయ భావజాలాన్ని ప్రచారం చేయడం మూలానా, కమ్యూనిస్టు భావజాలం యావత్‌ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేయడం వల్లనూ గురజాడ వేసిన రహదారి మీద పేరుకున్న దుమ్ముధూళీ చెదిరిపోయాయి. రాదారిని ఆక్రమించుకున్న కంచె, తుమ్మచెట్లు విరిగిపోయాయి. తెలుగుదేశంలోని ప్రధాన జీవనస్రవంతి ఆ రహదారిమీద ప్రయాణం మొదలుపెట్టింది. కమ్యూనిస్టు పార్టీ వారూ, అభ్యుదయ రచయితలూ గురజాడను మహాకవి, యుగకర్త అనీ పిలవకముందే దేవులపల్లి కృష్ణశాస్త్రి గురజాడను మహాకవి అని సంబోధించాడు.

సెట్టి ఈశ్వరరావుగారు 'మహాకవి, మహాపురుషుడు' అని పేరుమీద గురజాడ మీద రాసిన ఈ పుస్తకం ఆధునికులకు ఎంతో ప్రయోజనకరమైనది. అంతగొప్ప మహాకవి గురించి ఎంతో గొప్పగా రాసిన పుస్తకం ఇది. గురజాడ భక్తుడినైన నేను ఈ నాలుగు ముక్కలరాత నెపంతో నా దేవుడికి నేను నమస్కరిస్తున్నాను. - కె.ఎన్‌.వై.పతంజలి

Write a review

Note: HTML is not translated!
Bad           Good