మహాకవి శ్రీశ్రీ గురించి ఎవరు ఎన్ని విధాలుగా రాసినా విధిగా చదివి ఆనందించే అభిమానులు ఎందరో ఉన్నారు. ఇక శ్రీశ్రీ మెచ్చిన, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమైన ప్రముఖకవి, విమర్శకుడు కె.వి.రమణారెడ్డి రాస్తే, సాధికారంగా ఉంటుందని, క్షీరనీరన్యాయంగా ఉంటుందని నమ్ముతూ చదువుతారు. మధ్య మధ్యన ఆగి, ఆలోచిస్తూ మరో కొత్త కోణాన్ని తెలుసుకుంటారు.

'మహాప్రస్థానం' శ్రీశ్రీ కవిత్వానికి పునర్జన్మ మాత్రమే కాదు, జన్మలోనే జన్మలాంటిది. నవ్యసాహిత్యానికి కూడా అంతే. తన కంఠం నుంచి ఈ భీషణ మహావచోధార 'రణన్నినాదాలై' వెలువడిందో లేదో, ఇంతలోనే అన్యులు దీన్ని అనుకరించబూనుకున్నారు... అంటూ ఓ ఉదంతం ఉదహరిస్తారు కె.వి.ఆర్‌. 'విశాఖ టర్నల్‌ చౌల్ట్రీలో శ్రీశ్రీ తన కవిత చదవగానే, అడివి బాపిరాజు దానినొక కార్బన్‌ కాపీ తీసి, వెంటనే 'జ్వాల' పత్రికకు పంపాడు. భారతి శ్రీశ్రీ గేయాన్ని తిప్పి పంపడంతో దాన్ని 'జ్వాల'కు పంపేలోగానే బాపిరాజుది అచ్చయింది 'జ్వాలలు ఎగరనివ్వండి' శీర్షికతో. ఈనాడు అది ఎవరికీ గుర్తు లేదంటే, శ్రీశ్రీ ఎన్నుకొన్న మార్గం 'అనితర సాధ్యం' అయిపోయిందని అర్థం' అని కుండలు బద్దలు కొడతారు కె.వి.ఆర్‌.

Pages : 31

Write a review

Note: HTML is not translated!
Bad           Good