స్త్రీలపై పెరుగుతున్న నేరాల్ని... అరికట్టేందుకు... జైభారత్‌ ప్రతిపాదిస్తున్న పరిష్కారం - మగవాళ్లు మారాలి!

మీడియా, ఉద్యమాలు, చట్టం, సమాజం అందుకు భూమికని సిద్ధం చేయాలి!

మహిళల సమస్యలు తీర్చడానికి మగవాళ్లు ఏం చెయ్యాలి?

శతాబ్దం క్రితం స్వామి వివేకానందుడు ఇలా అన్నాడు : .. మహిళల సమస్యలను తీర్చడానికి మీరెవరు? మీరు ప్రత్యక్ష దైవాలా? జాగ్రత్త వారి జోలికి పోకండి!...||

ఒక్క మాటలో చెప్పాలంటే, మహిళల విషయంలో మగవాళ్లు చెయ్యాల్సింది సరిగ్గా ఇదే. వారి మానాన వారిని వదిలేస్తే అదే పదివేలు.

మహిళల సమస్య మగవాళ్లే.

మగవాళ్ల వైఖరి... మగవాళ్లు నిర్మించిన మతం... మగవాళ్లు నిర్మించిన రాజ్యం...మగవాళ్లు రూపొందించిన నీతి... మగవాళ్లు రాసిన చరిత్ర... మగవాళ్లు తయారు చేసిన భాష..మగవాళ్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం .. ఇవే ఆడవాళ్ల సమస్య!

ఇప్పుడు మగవాళ్లు రూపొందించే పరిష్కారం అక్ఖర్లేదు ఆడవాళ్లకి.

ఆడవాళ్ల సమస్యకి ఆడవాళ్లు పరిష్కారం వెతుక్కోగలరు.

వివేకానందుడు మొత్తంగా చెప్పింది ఇది : ''...ముందుగా మీ ఆడవారికి చదువు చెప్పించి, వారి మానాన వారిని వదిలి వెయ్యండి. తమకు ఏ సంస్కరణలు అవసరమో వారే మీకు చెబుతారు. తమ సమస్యలను తమ స్వంత పద్ధతిలో పరిష్కరించుకొనడానికి అనువైన పరిస్థితిలో స్త్రీనుంచాలి. మహిళల సమస్యలను తీర్చడానికి మీరెవరు? మీరు ప్రత్యక్ష దైవాలా? జాగ్రత్త వారి జోలికి పోకండి!...''

పేజీలు : 26

Write a review

Note: HTML is not translated!
Bad           Good