సమాజం సన్మార్గంలోనే నడవాలనే బలమైన ఆకాంక్షతో, యాభై ఏళ్ళ కథాయాత్రలో మూడొందల కథలు, నవలలు, నాటకాలు, అనువాదాలు, వ్యాసాలు రాసిన సాహిత్యజీవి మధురాంతకం రాజారాం. ఆయన రాసిన కథలన్నీ మన ఇంట్లోనో, పక్కనింట్లోనో, మన వెనక వీధిలోనే జరిగినట్టే ఉంటాయి. జరిగిన కథని ఆయన చెప్పేతీరు ఆసక్తిదాయకమైనది. ఆయన కథలూ, కథల్లోని పాత్రలూ అంత సహజంగా ఉంటాయి. ఊహలకీ, మాయలకీ ఆయన కథల్లో తావులేదు.కన్నవీ, విన్నవే ఆయనకు కథలయ్యాయి. దుక్కిదున్ని, నారుపోసి, నాట్లు వేసి, కలుపుతీసి, కోసి, కొట్టి, నూర్చి పంట చేసినట్టుగానే ఆయన కథారచన సాగుతుంది. ఆయన కథల్లో, కథనంలో, భాషలో  మృదుత్వం ఉంటుంది. తన అనుభవంలోకి వచ్చిన మనుషులూ, వాళ్ళమధ్య సంఘర్షణలూ, సమస్యలూ..వీటినే ఆయన కథలుగా రాశార. అందుకే మధ్యతరగతి పల్లె జీవనంలోని భిన్న పార్శ్వాలు రాజారం కథల్లో కన్పిస్తాయి.

రాజారాం కథలన్నింటిలో ఒక్కటే కేంద్ర  బిందువు. అది మనిషిలోపలి మంచితనం, ఆయన కథలు కొన్నింటిలో దుర్మార్గులు కనిపించవచ్చుగానీ, దుర్మార్గాలు కనింపించవు. వాస్తవం ఎంత దుఆర్మర్గంగా వున్నా, అందులో మంచిని మాత్రమే కోరుకునే రచయిత. వినూత్నంగా కథ చెప్పడానికి నిరంతరం ప్రయత్నం చేసిన మధురాంతకం రాజారాం మానవీయ స్పందనగల సమాజం కోసం తపించిన గొప్ప రచయిత.

Write a review

Note: HTML is not translated!
Bad           Good