మధురాంతకం రాజారాం (1930-1999): తెలుగు కథానికను ఉన్నత ప్రమాణాలకు చేర్చిన గొప్ప కథకులలో మధురాంతకం రాజారాంగారు ప్రముఖులు. కథానికలతోబాటూ ఆయన నవలలూ, నాటకాలూ, గేయాలూ, గేయనాటికలూ వెలయించారు. తన సాహిత్య రచనలను ఆయన సమకాలీన చరిత్రకు ప్రత్యామ్నాయంగా మాత్రమే గాకుండా, అచ్చమైన జాతీయతా ముద్రవున్న ఆధునిక ప్రక్రియలుగా కూడా తీర్చిదిద్దారు. రాయలసీమ జానపద సాహిత్యంలోని వుత్కంఠభరితమైన కథనధోరణినీ, సంప్రదాయ సాహిత్యంలోని ప్రగాఢతనూ, ఆధునిక సాహిత్య ధోరణులలోని వైచిత్రినీ కలగలిపి ఆయన తనదైన విశిష్టమైన శైలీ శిల్పాలతో దాదాపు 300 కథలు రాశారు. పిల్లల కోసం చిన& కథలూ, గేయాలూ రాశారు. సంపాదకుడిగా తెలుగు కథానిక గొప్పతనాన్ని నిరూపించే కథా సంకలనాలను రూపొందించారు. తమిళం నుంచీ తెలుగు అనువాదాలు సాగించి తంజావూరు విశ్వవిద్యాలయం బహుమతినీ పొందారు. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డలతోపాటూ 1993లో కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డునూ పొందారు. విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good