ఈ నవలలో నిర్థిష్టమైన స్థల కాలాలున్నాయి. అనివార్యమైన సన్నివేశాలూ, సంఘటనలున్నాయి. వీటిలో పాల్గొనే వివిధ పాత్రలున్నాయి. ఆ పాత్రల అనుభవాలూ తిండీ తిప్పలూ, ఆటపాటలూ, మాటల తీరుతెన్నులూ సంబంధాలూ, ఆరాటాలూ, విరుద్ధ స్వభావాలూ, భౌతిక మానసిక ఘర్షణల చిత్రణ వుంది. స్థానిక సమాజ చలన సూత్రా పరంగా, వాస్తవికంగా విశ్వసనీయంగా ఈ కథనం ఈ చిత్రణ సాగాయి. ఈ కథావస్తువును గురించి ఆలోచిస్తున్నప్పుడు రైతుల జీవితం ఇట్లా ఎందుకు తయారైంది అని తల్లడిల్లే సంవేదన కలుగుతుంది. ఏ రాజకీయ ఉపన్యాసమూ, ఏ సామాజిక శాస్త్ర ప్రతిపాదనా, ఏ అంకెలూ ఇవ్వలేని సామాజిక అవగాహనను ఈ నవల కల్గిస్తుంది. ఒక అలజడిని కల్గిస్తుంది.

- కేతువిశ్వనాథ రెడ్డి

పేజీలు : 182

Write a review

Note: HTML is not translated!
Bad           Good