వాడ్రేవు వీరలక్ష్మీదేవి కథకురాలు, భావకురాలు, సత్యాన్వేషి. సమాచార ప్రసారసాధనాల్లో గొప్పమార్పు సంభవించిన గ్లోబలైజేషన్ నేపథ్యంలో మన ఊళ్లూ, మన పరిసరాలూ, మన రోజువారీ జీవితం ఎట్లా అతలాకుతలమవుతున్నాయో ఆమె అందరికన్నా ముందే గుర్తించిందనడానికి సాక్ష్యం ఈ వ్యాసాలు. అయితే సమాజంలో వస్తున్న మార్పును గుర్తించడంతో ఆవేదన చెందడంతో ఆగలేదామె. మనం ఏ చిన్నిచిన్ని సౌకుమార్యాల్నీ, ఏ విలువల్నీ, దయార్ధ్రపూరితమైన ఏ అనుబంధాల్నీ కాపాడుకోగలిగితే ఈ సరికొత్త ప్రళయం నుంచి బయట పడగలమో కూడా చెప్తున్నారామె. ఆంధ్రప్రభ దినపత్రికలో 2003లో ధారావాహికంగా వెలువడ్డ ఈ రచనలు మరెంతోకాలంపాటు మనకు కరదీపికలుగా దారిచూపించనున్నాయి.

Write a review

Note: HTML is not translated!
Bad           Good