ఈ నాటకంలో గ్రామీణ ప్రాంతాలలో వివిధ సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యంగా తీర్చిదిద్దబడిన పాత్రలు, బిగువైన సన్నివేశాలు, సహజమైన సంభాషణలు, పాత్రోచితమైన భాష, మాండలికాలు, సామెతలు, ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. సందర్భోచితంగా ఉన్న పాటలు ప్రేక్షకుల్ని ఉత్తేజపరుస్తాయి. ఇంత విశిష్టమైన నాటకం తెలుగు నాటక రంగంలో మరొకటి లేదనటం అతిశయోక్తి కానేకాదు.

    హిందూ-ముస్లిం ఐక్యత, జనాభాలో సగంగా వున్న మహిళలు, ఉద్యమాలో కూడా ముందుండాలనీ, ప్రజా ఉద్యమాలలో సామాన్యులే అసామాన్యపాత్ర నిర్వహించగలరనే విషయాలను నాటకంలో స్పష్టం చేయడం ద్వారా 'మా భూమి' ఇతివృత్తానికి మరింత పుష్టి చేకూరింది.

    కొన్ని గొప్ప నాటకాలు చదువుకునేందుకు మాత్రమే... ప్రదర్శన కష్టతరం.. మరికొన్ని నాటకాలు ప్రదర్శనలో మాత్రమే గొప్పగా వుంటవి. కాని 'మా భూమి' నాటకం చదువుటకూ, ప్రదర్శనకూ అనువైన గొప్ప నాటకం.

Write a review

Note: HTML is not translated!
Bad           Good