రాజులదీవి

ఇవ్వేళ నేను చెప్పే కథ ఈ జన్మకి మర్చిపోరు తమరు. '' అన్నాడు ఫకీరు.

''అంత గొప్పదా?'' అడిగాడు వసంతకుమార్‌.

''గొప్పదో కాదో తెల్దుగానీ మనసుని కొంచెం బాధ పెడద్ది పంతులుగారూ'' అన్నాడా ముసలి ఫకీరు.

''ఊరించక మొదలెట్టు'' అంటా ఫకీరు పడవ అడ్డచెక్క మీద చతికిలబడ్డాడు వసంతకుమార్‌.

సాయంత్రం ఆరు దాటుతుంది. అప్పుడప్పుడే చీకటి పడ్తుంది. గోదాట్లో గాలి లేదు. చొల్లంగి ఉప్పుటేరులో లాగే ఈ సుందరపల్లి రేవులో కూడా చాలా పడవలాగి వున్నాయి.ఎక్కడెక్కడ్నుంచో వలసవచ్చిన బెస్తవాళ్ల కాపురాలు కూడా ఈ పడవల్లోనే. వాళ్ళందరికీ పెద్ద ఫకీరు. వయసు డెబ్బై అయిదు దాటిన ముసలోడు ఫకీరు పెరిగిన పొడుగాటి గెడ్డం, జుట్టూ తెల్లగా మెరిసిపోతుంటాయి. పొద్దోతే ఒక అర సీసాడు నాటు బిగిస్తా ఈ వయసులో కూడా బలమైన సర్వీబద్దలాగుంటాడు. మందేసేటప్పుడు వాడ్ని కదిపితే చెట్టు మీంచి పండిన ఆకులు రాలినట్లు కథలే కథలు. చెప్పింది చెప్పకుండా చెపుతాడు......

Write a review

Note: HTML is not translated!
Bad           Good