అతిపేద కుటుంబంలో పుట్టి, పట్టుదలే పెట్టుబడిగా, ఆత్మస్థైర్యమే ఆయుధంగా, అణగారిన ప్రజల జీవితాలకు ఆశాజ్యోతిగా మెలగి, అంచెలంచెలుగా ఎదిగి, విశాల భారతదేశానికి ప్రధాని పదవినలంకరించిన లాల్‌ బహదూర్‌శాస్త్రి అంటే నాకు అమితమైన అభిమానం. వేషధారణ, శరీర దారుఢ్యం, అందచందాలు ఇవేవీ మనిషి యొక్క వ్యక్తిత్వానికి కొలమానం కావని, గుణగణాలు, సత్‌శీలత, నిరాడంబరతే వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయని చాటిచెప్పిన నిరాడంబర జీవి శ్రీ శాస్త్రీజీ. ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను సేకరించి నాకు చేతనయిన విధంగా రేపటి పౌరులుగా మారవలసిన నేటి బాలలకు తెలియజేయడానికే ఈ రచన. ఈ నా ప్రయత్నం కొంతయినా సత్ఫలితాన్నిస్తే నా కృషికి సార్ధకత చేకూరినట్టేనని భావిస్తాను.

Write a review

Note: HTML is not translated!
Bad           Good