సాంఘీక పరిస్థితులను బట్టి సాహిత్యము ఉద్భవిస్తుంటుంది. రాజులకాలంలో వారిమీసాల మీద, వలపు గత్తెలమీద విపరీతమైన సాహిత్యం వచ్చినది. తరువాత కాలంలో చిన్న చిన్న జమీందారీ ప్రభువులనాశ్రయించి వారి వంశవృక్షాలను వర్ణిస్తూ, పచ్చిశృంగారమును ఒలకబోస్తూ సాహిత్యం వచ్చినది. ఆ తరువాత రాజులు. ఫ్యూఢల్ ప్రభువులు పోయారు. సాంఘీక పరిస్థితితులలో మార్పులొచ్చాయి. ముక్కలు చెక్కలుగా ఉన్న దేశాన్ని ఒకే ప్రభుత్వం కింది బ్రిటీష్  ప్రభువులు పాలించారు. సాంఘీక పరిస్థితులు మార్పుచెందాయి, అనేక ఉద్యమాలు వచ్చాయి. దేశభక్తిని  ప్రభోధించే సాహిత్యానికి నాంది వాచకంగై బంకింబాబు అసేతు హిమాచల పర్యంతం ‘వందేమాతరం’ అంటూ కోట్లాది గళాలు వినిపించినై.
ఇంకా బంకింబాబు కలం నుండి అత్యుతమమై నవల సాహిత్యం  వెలువలడింది. పాత అంతా రోత అనము కానీ, పాతలోంచి మంచిని తీసుకుని   నూతనత్త్వాన్ని మొట్టమొదటగా సాహిత్యానికి చేకూర్చింది బంకిం బాబే. బెంగాలులో విశ్వసాహిత్యం ఉద్భవించింది. సాహిత్యరూపంగా బెంగాలులోనే కాకుండా దేశం మొత్తానికి నూతనొత్తేజాన్ని, నూతనోత్సాహాన్ని కలుగజేసింది బంకిం చంద్ర చటర్జీయే.ఈయన అద్భుత కలకరవాలం నుండి వెలువడిన ‘కృష్ణకాంత్‘ చదవండి! చదివించండి!!

Write a review

Note: HTML is not translated!
Bad           Good