అఖిలజన హృదయానందకరంబగు సంగీతవిద్య అభ్యసించు విద్యార్ధులకు ఉపయోగకరంగా ఉండేందుకు శ్రీ ఏకా సుబ్బారావు గారు రాసిన ఈ గ్రంధము ఆరంభమున వాగ్గేయకారుల చరిత్రలు చేర్చారు. పిమ్మట స్వరావళి మొదలు అలంకారములు అభ్యసించువరకు అన్నిరాగముల యొక్క స్వరస్ధానములు తెలియునటుల స్వరావళి మొదలగునవి కొన్ని రాగములలో వ్రాసారు. ఇట్లేర్పరచుట వలన ముందు రాబోవు గీతములు, స్వరజతులు, వరక్ణములు, కృతులు మొదలగు వానికి గల రాగముల యొక్క స్వర సాధనములను తెలిపి విద్యార్ధులు తమకై తామే అభ్యసించుట కనుకూలమగుచున్నది. పర్వతంబులెల్ల ఒక్కదర్పణంబున కన్పించిన రీతి స్వరరాగ తాళకుల లక్షణ లక్ష్యంబు తెంతయు దీని జూచు వారికి కరతలామలకంబుగా ఉండునటుల ఈ గ్రంధమున సమకూర్చారు శ్రీ సుబ్బారావుగారు. 

Write a review

Note: HTML is not translated!
Bad           Good