ప్రకృతి రహస్యాలను గ్రహించటంలో భాగంగానే, భూమి చుట్టూ సూర్యుడూ, ఇతర గ్రహాలు తిరుగుతున్నాయనుకున్న పాతభావనలు తప్పని ఋజువై కోపర్నికస్‌, గెలీలియోల సూర్యకేంద్ర సిద్ధాంతమే సత్యమనీ, శాస్త్రమనీ తేలింది.

నేటికీ భూకేంద్ర భావనను ప్రాతిపదిక చేసుకుని జ్యోతిషాలు, ముహూర్తాలూ, పుష్కరాలూ నిర్వహించటం మానవ వైజ్ఞానిక అభివృద్ధిని ఆచరణలో గుడ్డిగా నిరాకరించటం తప్ప వేరొకటి కాదు.

మానవ జీవిత సమస్యలకు మానవులు నిర్మించుకున్న (స్వార్థ) సమాజమూ, (అవినీతి) వ్యవస్థలూ కారణాలు తప్ప నదులూ, గ్రహాలు కాదు.

మనం నిర్మించుకున్న రాజ్యం (స్టేట్‌) సృష్టించుకున్న సంపద (ఆర్థికవ్యవస్థ) అభివృద్ధి చేసుకున్న విజ్ఞానమూ (విద్యా - వైద్య వ్యవస్థలు) కొందరి గుత్తాధిపత్యం కావటంవల్లనే మన జీవితం అభద్రతకూ, అశాంతికీ కారణమవుతున్నాయి తప్ప ఇందుకు ఏ దేముడూ, దెయ్యమూ, పుట్టా, చెట్టూ, నదులూ, పాములూ, తుమ్ములూ, బల్లులూ కారణాలు కాదు.

పేజీలు : 54

Write a review

Note: HTML is not translated!
Bad           Good