''గాంధీ చెప్పినట్లు కాంగ్రెసు పార్టీ నడుస్తున్నదా? గాంధీగారు గ్రామస్వరాజ్య మన్నాడు. ఎందుకన్నాడు? ఒకప్పుడు మనది స్వయంసమృద్ధ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ముస్లింలొచ్చారు, వాళ్ళు తమ భోగభాగ్యాలకోసం, తమ విషయవాంఛా పరితృప్తికోసం పన్నుల రూపంలో గ్రామాలను దోచుకుని నగరాల్లో సెటిలయ్యారు; ఇంగ్లీషువాళ్ళు వచ్చారు. వాళ్ళు వర్తకులు, నిజానికి వర్తక జాతి, ఇంగ్లీషుకూడ ఫ్రెంచిభాషంత సాంస్కృతిక భాష కాదు. అందుకనే భారతదేశాన్ని మార్కెట్టుగా మార్చేశారు. గ్రామాలు ముడిసరుకులను వాళ్ళకు సప్లయిచెయ్యాలి, వాళ్ళు వాటిని తీసుకువెళ్ళి తయారయిన వస్తువులను ఇండియాకు తీసుకువస్తారు. వాటిని మన పట్నాల, నగరాల జనం కొనాలి. మనం దేశంలో ఏదీ ఉత్పత్తి చేయకుండా మన పరిశ్రమల నడుములు విరగొట్టారు. మన నేతగాళ్ళ వేళ్ళు విరగ్గొట్టిన విషయం అందరికీ తెల్సిన సంగతే!....

పేజీలు : 328

Write a review

Note: HTML is not translated!
Bad           Good