కెరటాలు - కిరణాలు - డాక్టర్‌ ఆవంత్స సోమసుందర్‌

అనే ఈ గ్రంథం పుష్కర కాలం ప్రజాశక్తి దినపత్రికలో ప్రతి ఆదివారం ప్రత్యేక శీర్షికగా ప్రచురితమవుతూ వచ్చింది. ఈ ప్రచురణకు ప్రధాన కారకులు శ్రీ తెలకపల్లి రవిగారు. ఆయన సాహితీ హృదయులు, సుహృధ్వరులు. వారి ప్రోత్సాహం వల్ల నేను విశేషమైన కృషిసలిపి నాకందినంతవరకూ ప్రపంచదేశాల మహాకవుల గురించీ, రచయితల గురించీ సమాచారం సేకరించి, ఈ వ్యాసాలను రూపొందించాను. వీటిని చదివి పాఠక బాహుళ్యం ఎంతో మెచ్చుకున్నారు. నాకెందరో ఉత్తరాలు రాసారు. శ్రీ తెలకపల్లి రవిగారు కూడా తన సంకల్పం నెరవేరినందుకు సంతోషించారు. నా గ్రంథాల ప్రచురణ వత్తిడుల వల్ల ఈ గ్రంథాన్ని ప్రచురించడం ఆలస్యం అయింది. ఈలోగా ఇలాంటి గ్రంథాలు కొన్ని ప్రచురితమయ్యాయి. కానీ అంతర్జాతీయ రచయితల ఎన్నికలో ఎవరి అభీష్టం వారిది, ఎవరి కృషి వారిది, ఎవరి దృక్పథం వారిది. దానిని అనుసరించే వరణమూ సాగుతుంది. వివరణమూ సాగుతుంది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good