''సాధనమున పనులు సమకూరు ధరలోన'' అను వేమన మాటకు ప్రత్యక్ష నిదర్శనము శ్రీ శొంఠి కృష్ణమూర్తి గారి ఈ కథా రచన. కథా రచన ఒక సాధనగా తీసుకొని దానిని సాధించినవారు శ్రీ కృష్ణమూర్తి గారు. కథా రచన సాధక బాధకాలన్నీ స్వానుభవములుగావుననే నేడు ''కథలు రాయడమెలా'' అనే ఈ పుస్తకాన్ని మనకందజేయ గలిగినారు. వివిధ భాషలలోని కథలు వాటి విషయమై విమర్శకుల అభిప్రాయాలు సేకరించి, స్వానుభవమును జతపరచి, కథా రచనకు సంబంధించిన అన్ని అంశాలను సవిస్తరముగా చర్చించి కథా రచనకు పూనుకొనదల్చిన తెలుగు ఉత్సామవంతులగు వారికందరకు ఒక అమూల్య గ్రంథమును సమర్పించినారు.'' - కాళోజీ

''నేటి తెలుగు సాహిత్యంలో అన్నిటికన్న ముందుకు వచ్చిన స్వరూపమూ, కొత్త రచయితలను బలంగా ఆకర్షించేది కథ. ఈ పుస్తకంలో కథల గురించి చెప్పబడిన అనేక విషయాలు, కథకులు కాబోయే చాలా మందికి ఉపయోగకరంగా ఉండటానికి, తన బాధ్యతను తెలుసుకోవటానికి, అయోమయస్థితిలో కథా రచన సాగించుతున్నవారు ఒక దారికి రావటానికి ఈ పుస్తకం ఎంతగానో ఉపయోగపడగలదని ఆశిస్తున్నాను. - కొడవటిగంటి కుటుంబరావు

పేజీలు : 87

Write a review

Note: HTML is not translated!
Bad           Good