''కథల అత్తయ్యగారు''లో అత్తయ్యగారు, 'జేబు'లో పరిమళ నిజజీవితాల్లోంచి వచ్చినవాళ్లే. ''పెంపకం''లో తండ్రి కొడుకుని నీళ్లలోకి బలవంతంగా ఈడ్చుకెళ్లడం నిజంగా జరిగిందే. మనుషులూ, సంఘటనలూ నిజమే అయినా కథ అంతా కల్పనే. అంటే ఒక వ్యక్తినో (పాత్ర కాకముందు), ఒక సంఘటననో తీసుకుని కథ రాసినా, కథకి అవసరమయినట్టు మలుచుకోడంతో వ్యక్తులు పాత్రలుగా మారిపోతారు. అంతేకానీ ఉన్నదున్నట్టు, న్యూస్‌ రిపోర్ట్‌ ఇవ్వడం జరగదు. జరగలేదు.

తెలుగువాళ్లకి అమెరికాలో అడుగెట్టగానే అనేక ప్రతిబంధకాలు ఎదురవుతాయి. (ఒక్క తెలుగువాళ్ళకి మాత్రమే అని కాదు. నా కథలకి సంబంధించినంతవరకూ అని గమనించాలి). అపార్ట్‌మెంటు అద్దెకి తీసుకోడం దగ్గర్నుంచీ, మేనేజరుతో మాట్లాడడం వరకూ అడుగడుగునా అనేకానేక అవస్థలు. మనం నేర్చుకున్న భాష ఇక్కడ పనికిరాదు. ప్రతి అనుభవమూ ఒక ఎడ్యుకేషనే! అలాటివి గమనించినప్పుడే ''పలుకు వజ్రపుతునక'8, ''విధీ, హతవిధీ'' రాసేను....

- నిడదవోలు మాలతి

Pages : 161

Write a review

Note: HTML is not translated!
Bad           Good