వృత్తినే ప్రవృత్తిగా మార్చుకుని, సాహిత్య బోధనను సాహిత్య అధ్యయనంగా గుర్తించిన అతికొద్ది మంది విశ్వవిద్యాలయ అధ్యాపకులలో కిన్నెర శ్రీదేవి గారొకరని నిరూపించే పదకొండు వ్యాసాల సంకలనం యిది. వివిధ సందర్భాల్లో, వేర్వేరు సమయాల్లో కథను గురించీ, కథకుల్ని గురించీ రాసిన యీ వ్యాసాలు విమర్శకురాలి అభిరుచికీ, అనుశీలానాసక్తికీ గీటురాళ్ళుగా నిలుస్తాయి.

రచయిత సమగ్ర సాహిత్యపు నేపథ్యంలో, అతడి/ఆమె ప్రాతినిధ్య రచనల్ని గురించి చర్చించగలగాలి. కిన్నెర శ్రీదేవి ఈ విషయంలో చిత్తశుద్ధితో ప్రయత్నించారు.

సాహిత్య సృజనలా సాహితీ విమర్శ కూడా గొప్ప సాధన. ఆ సాధన చేయడానికి కావల్సిన శక్తియుక్తుల్ని శ్రీదేవిగారిలో వున్నాయని యీ పుస్తుకం వెల్లడి చేస్తోంది. ''కథా సాహిత్య విమర్శలో జరగాల్సినంత కృషి జరగడం లేదు' అన్న అసంతృప్తిని, లోటును ''కథ విమర్శనం - విశ్లేషణం'' పుస్తకం భర్తీ చేస్తుంది.

- ఆచార్య మధురాంతకం నరేంద్ర

Pages : 150

Write a review

Note: HTML is not translated!
Bad           Good