కథ 90తో 1991లో మొదలై ముప్ఫై ఏళ్లుగా సాగుతున్న యాత్ర. ఈ కరోనా కష్టకాలం లోనూ ఆగని యాత్ర. మా అనుభవాలనీ&్న ఏదో ఒక సందర్భంలో అక్షరబద్ధమైనప్పుడు కానీ ఇదెలా సాహసయాత్ర అనేది అర్థంకాదు.

ఈ 'కథ 2019' 17 ఉత్తమ కథల సంకలనం.

ఈ సంకలనంలో తొలి, తుది కథలు (కొట్రవ్వ, మిట్టమధ్యాన్నపు నీడ) రచయిత్రులవే కావటం, అవి స్త్రీలపై జరిగిన అత్యాచారాలకు సంబంధించినవి కావటం యాదృచ్ఛికమే. అయితే ఈ పుస్తకంలోని ఆరు కథల్లో (కొట్రవ్వ, ఊపిరి, నేను...తను...అతను, నిశీధి శలభం, కేరాఫ్‌ బావర్చీ, మిట్టమధ్యాన్నపు నీడ) స్త్రీ సమస్యలు ముఖ్యం కావటం అందునా ఐదింటిలో లైంగికాంశాలు చోటుచేసుకోవటం ఎంత మాత్రం యాదృచ్ఛికం కాదు. స్త్రీల జీవితాల చుట్టూ సాలెగూళ్లు మరీ మరీ అల్లుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఇది అనివార్యమే.

ఈ కథా సంకలనంలో కొట్రవ్వ - మన్నం సింధుమాధురి, ఊపిరి - షాజహానా, నేను...తను... అతను - కొట్టం రామకృష్ణారెడ్డి, నాలుగో ఎకరం - శ్రీరమణ, సావిత్రి యిల్లు - మధురాంతకం నరేంద్ర, లోపలి చొక్కా - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి, నిశీథి శలభం - నాగేంద్ర కాశీ, పునరావృతం - జి.ఉమామహేశ్వర్‌, డబుల్నాట్‌ - అరిపిరాల సత్యప్రసాద్‌, వేదవతి - జి.వెంకటకృష్ణ, వృద్ధి - కొలకలూరి ఇనాక్‌, కుర్రుపోట్ల పుణ్యతిథి - చింతకింది శ్రీనివాసరావు, ఇత్తనాల చెనిక్కాయలు వలుస్తూ - ఎండవల్లి భారతి, కేరాఫ్‌ బావర్చి - చరణ్‌ పరిమి, తపసుమాను - కె.ఎ.మునిసురేష్‌ పిళ్లె, దేహయాత్ర - ఇండ్ల చంద్రశేఖర్‌, మిట్టమధ్యాన్నపు నీడ - ఉమా నూతక్కి కథలు కలవు.

పేజీలు : 278

Write a review

Note: HTML is not translated!
Bad           Good