ఫోటోలు కూడా ...
'కన్యాశుల్కం' ఒక ఆల్‌టైమ్‌ హిట్‌ నాటకం. తెలుగులో మొదటి ఆధునిక నాటకం. తెలుగు నాటక రంగానికి దిశా
నిర్దేశం చేసిన మహత్తర రచన.1909లో రెండోకూర్పును తెచ్చినప్పుడు ఇన్నర్‌ టైటిల్‌ పేజీ మీద ''హాస్యరస ప్రధానమగు నాటకము'' అని అచ్చు వేయించారు. దాన్నిప్పుడు విశాలాంధ్ర వారి తొమ్మిదవ ముద్రణలో చూడవచ్చు. అయితే 'కన్యాశుల్కం' ఒక విషాద నాటకమని శ్రీశ్రీ అన్నారు. ఏమైతే, కన్యాశుల్కం నాటకానికి వున్నంత ప్రాచుర్యం తెలుగుదేశాన మరే నాటకానికీలేదు. సెట్టి ఈశ్వరరావు సంపాదకత్వంలో వెలువడిన 'కన్యాశుల్కం'లో, నాటకంలో ప్రస్తావించిన విజయనగరంలోని స్థలాల ఫొటోల్ని కూడా ప్రచురించటం విశేషం. 222 పేజీలతో పేపర్‌బ్యాక్‌గా ఇది వెలువడింది.

Write a review

Note: HTML is not translated!
Bad           Good