అనేక దినాలుగా యుద్ధరంగాన్ని తలపిస్తోంది అందాల సుందర ప్రదేశం...'కాశ్మీర్‌'.

కశ్మీర్‌ కోసం భారత్‌, పాకిస్తాన్‌లు ఎందుకు కొట్లాడుకుంటున్నాయి? ఆ కోట్లాట గురించి కశ్మీరీలు ఏమనుకుంటున్నారు? కశ్మీర్‌ ఏ పరిస్ధితుల్లో భారత దేశంలో భాగం అయ్యిందీ? 1989 తరువాత భారత్‌ నుండి వేరుపడే లక్ష్యంతో కశ్మీర్‌లో మిలిటెంట్‌ పోరాటం ముందుకు రావడానికి గల నేపథ్యం ఏమిటీ? ఆ  పోరాటంతో భారత ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఎటువంటిది?

1995 నుండి 2003 మధ్య అయిదుసార్లు కశ్మీర్‌ పర్యటించిన హక్కుల సంఘాల నిజనిర్ధారణ కమిటీ నివేదికల సారాంశమైన ఈ పుస్తకం, పై ప్రశ్నలన్నిటికీ సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తుంది.

ఈ పుస్తక రచయిత కె.బాలగోపాల్‌ ప్రముఖ న్యాయవాది, మానవ హక్కుల సంఘం నాయకులు, రచయిత, వ్యాసకర్త.

Write a review

Note: HTML is not translated!
Bad           Good