కల్లోల కాలానికి చిత్రిక పట్టం ఎంత ముఖ్యమో ప్రశాంత సమయంలోనూ ప్రజల బతుకులు ఎంత కల్లోలంఆ ఉంటాయో చిత్రించడం అంతే ముఖ్యం. ఈ రెండు కీలకమైన అంశాలు ఈ నవలలో మనకు కనిపిస్తాయి. కేవలం పోరాటాలు, ఉద్యమాలు, ఉద్రేకపరిచే సన్నివేశాలే కాక, బతుకుపోరాటం కోసం సామాన్య ప్రజలు పడే ఆరాటం కూడా సాహిత్యంలో రికార్డు కావలసిన అవసరం ఎంతో ఉంది.

జమిలిగా ఈ రెండు అంశాలు కలిసిన నవల 'కాలరేఖలు'. అందుకే ఈ నవలకు ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ పల్లెల్లోని అమాయక జీవితాన్ని, కల్లాకపటం ఎరుగని మనసులను, నిర్మల హృదయులైన వారి మానసిక స్పందనల్ని తెలుగుకోవడానికి, బొమ్మకు బొరుసున్నట్లుగా ఆ మనస్తత్వానికి వ్యతిరేకులైన వారు ఉండటం సహజం. అదో అలాంటి వారి గురించి కూడా పాఠకుడు తెలుసుకునేందుకు ఈ నవలలో అనేక అంశాలు ఉన్నాయి. - పుప్పల నరసింహం

దొరల పెత్తందారీని, రజాకార్ల రాక్షస కృత్యాలను ఇతివృత్తంగా గల నేపథ్యంతో రచింపబడిన కాలరేఖలు, కాలానికి గీచిన క్రౌర్యరేఖలు; చరిత్ర పుటల్లో చెరిగిపోని, చెదిరిపోని చీకటి రేఖలు. ఇటీవల సామాజికపరంగా వెలువడిన నవలలేవీ ఇంత విపులంగా, ఇంత స్పష్టంగా గ్రామీణ వాతావరణాన్ని, కుటుంబ ఆచార వ్యవహారాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను పొల్లుపోకుండా వర్ణింపబడిన నవలారాజము 'కాలరేఖలు' తప్ప మరొకటి నా కంటబడలేదు. - ముద్దసాని రాంరెడ్డి

పేజీలు : 554

Write a review

Note: HTML is not translated!
Bad           Good