ఇందులోని ప్రధానపాత్రలు నాలుగు. ప్రకాశం, కళ్యాణి, క్రిష్ణమూర్తులతో పాటు ఇందిర. నిజానికి ఇందిరే ప్రధానపాత్ర. ఈ కథలోని వ్యక్తులందరూ ఆమెచుట్టూ తిరుగుతూ రకరకాలుగా ప్రభావితం చెందుతూ వుంటారు. ఆమెను అంగీకరించలేరు. వదలలేరు. ఆమెవల్ల పరిచయమయిన మొదటి పాత్ర ప్రకాశం.

ఎం.బి.బి.ఎస్. చదివే ప్రకాశాన్ని అందరూ మెత్తని వాడంటారు. అసమర్థుడని కూడా కొందరనేవారు. సాటి విద్యార్థులతన్ని చూసి "వట్టి చవటవురా" అని తేల్చి చెప్పేవారు. "బొత్తిగా చేవలేని వాడివి. ఎలా బతుకుతావో కానీ" అని నిట్టూర్చేది వాళ్ళమ్మ.

"చిన్నతనం నుంచీ ఇల్లు కదిలి ఎక్కడికీ వెళ్ళేదాన్ని కాదు. నలుగురితో కలిసి ఆడుకోవడం కూడా తెలీదు... కనీసం మా నాన్నైనా నలుగురితో కలిసిమెలిసి వుండగలిగే మనిషైతే నేనిలా తయారవకపోదు నేమో! ఇవీ కళ్యాణి పెరిగిన కుటుంబ పరిస్థితులు.

క్రిష్ణమూర్తి విశాఖపట్నంలోని ఎ.వి.యన్. కాలేజీలో బి.ఏ. చదువుతూ తాత తండ్రులిచ్చిన ఆస్తుల్ని ఖర్చు చేస్తూ కులాసాగా కాలం గడిపే విలాస యువకుడు.

"ఏ పని చేసినా నేను కళ్ళు తెరుచుకునే చేస్తాను. నాకూ మిగతావాళ్లకీ అదే తేడా. ఏడుస్తూ ఏదీ చేయ్యాను. ఏం జరిగినా ఏడవను..." ఇది ఇందిర వ్యక్తిత్వం.

విభిన్న మస్తత్వాలు గల ఈ నలుగురి మధ్య సహృదయులైన వసుంధర, డాక్టర్ చక్రవర్తి...

ఈ ఆరుగురి మధ్య జరిగే చిత్ర విచిత్రమైన సంఘటనలు ఎవరిని ఎవరి దరి చేర్చాయో తెలుసుకోవాలంటే సహజత్వానికి అద్దం పట్టే డా" పి. శ్రీదేవి గారి "కాలాతీత వ్యక్తులు" చదవవలసిందే.

Write a review

Note: HTML is not translated!
Bad           Good