కథానికలు....  ''ఆ వూరి నల్ల కొండలనంతటను శిధిలమైన బౌద్ధ కట్టడములు కలవు. అక్కడివారు వాటిని పాండవుల పంచలంటారు. ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతమ్మ వారు స్నానమాడని గుంటలూ లేవు. ఒక్క పెద్ద గుహలో నున్న బౌద్ధ విగ్రహమును శివుడని, దానిపక్కనున్న దేవీ విగ్రహమును గౌరి అని భావించి జంగాలు పూజ చేస్తున్నారు''. - (మీ పేరేమిటి?)   ''ఏం పాట్లొచ్చాయి దేవుళ్ళకి?'' దేవుళ్ళకి ఏ పాట్లూ లేవు! మన సాపాటు మాట ఆలోచించరేం?'' - (మతము: విమతము)  ''బాబూ కోపిగించితే చెప్పలేనుగాని ఆడారు చదువునేరిస్తే యేటౌతది?.... ఆడదాయి చెప్పకుండా పుట్టివారింటికి యెల్తానంటే లెంపలాయించి, కూకోబెట్టాలి గాని మొగారిలాగ రాతలుకోతలు మప్పితే ఉడ్డోరం పుట్టదా బాబూ?''  ''భగవంతుడు సృష్టిలోకల్లా ఉత్క ృష్టమైన వస్తువు స్త్రీ రత్నమే..... నీ కూతురు బడికి వెళుతున్నది కదా! విద్య విలువ నీకే బోధపడుతుంది''. - (దిద్దుబాటు)   ''వేదాలలోని మిస్టిసిజం వేద పండితులకే అర్థం కాదు. ప్రత్యక్ష జీవితంలో మనం ఎదుర్కొంటున్న విషమ సమస్యలను పరిష్కరించుకునేందుకు యీ వేద విజ్ఞానం ఒక్క పిసరు అక్కరకు రాదు. ఏ జ్ఞానం గురించి పండితులు మాట్లాడుతున్నారో, ఆ విజ్ఞానం అందరికీ అందేది కాదు. కొంతమందికే సాధ్యం; అదైనా నాకు సందేహమే''. ''అయితే మనకు పనికి వచ్చే జ్ఞాన మెలాటిదంటారు?''  ''అది ఒకే ఒకటి; యుగయుగాల జీవితానుభవం; ఈ విజ్ఞానమే మన దైనందిన జీవితానికి సహాయకారి. చీకటి నుంచి వెలుగులోకి తెస్తుంది''. - (సంస్కర్త హృదయం) గురజాడ - ఆధునిక తెలుగు కథకు ఆద్యుడు. తెలుగు సాహిత్యానికి దిశా నిర్దేశకుడు. ఆణిముత్యాల్లాంటి ఆయన కథలు మీకోసం .......

Write a review

Note: HTML is not translated!
Bad           Good