ఈ రచన విభిన్నమైనది. ఎందుకంటే ఇది అభివృద్ధి రాజకీయాలను వాటి పర్యవసానాలను వీలయినంత వాస్తవికంగా, జీవితానికి సన్నిహితంగా చిత్రించి చూపింది. ఇందులోని పాత్రలు యోధాను యోధులు కారు. కేవలం బాధితులు. ఈ బాధితులకు ఒక గొప్ప శక్తి ఉంది. ఇది సోలార్‌ ఎనర్జీకన్నా గొప్పది. ఇదొక రెన్యువబుల్‌ ఎనర్జీ. తరిగిపోని ఇంధన వనరు. ఈ జీవశక్తి ఆరాటపడటంతో ఆగకుండా పోరాడటానికి కూడా సిద్ధపడుతుంది.

భైరవపల్లెకు, నిగర్‌డెల్టాకు భౌగోళికంగా తప్ప మరి ఏ తేడాలున్నాయి. మనుషులను, మానవసమూహాలను డిస్పోజ్‌ చేస్తున్న పెట్టుబడుల భాషకు ఏ తేడాలున్నాయి.

ఎక్కడి ప్రజా పోరాటపు భాషలో నైనా తేడాలు మాత్రం ఏముంటాయి? ఈ కల్లోల కడలి అంచులు రాతిగుండెలను నీటి బిందువులుగా కోయగలవా?

ఈ పర్యావరణ యుద్ధం ఇప్పట్లో ముగిసేది కాదు. ఈ యుద్ధంలో ఎవరు ఎటు నిలబడతారు ఎవరు ఈ యుద్ధాన్ని ఆపుతారనేది భైరపల్లె, మద అడవులు, ఒడ్డున గిలగిల్లాడుతున్న చేపలు చెపుతాయి. ఈ యుద్ధ బీభత్సాన్ని 24/7 చూస్తేనే ఉండకండి .... - సీతారాం

పేజీలు :174


Write a review

Note: HTML is not translated!
Bad           Good