నిన్ను నీవు జయించావు. గుర్తించదగిన నీ శతృవుకి కూడా పౌరహక్కులేకాక అతడు పోగొట్టుకున్నదానికంటే ఎక్కువే ఇచ్చావు. అది నిన్ను మానవులకంటే అధికుడిని, దేవుడిని చేసింది. మేము కాల్పనిక కథల్లోలాగ కాక నీలాంటి తెలివైన, దయార్థత, కరుణ నిజరూపంలో చూసి జయజయధ్వానాలు పలుకుతున్నాము. యుద్ధంలో మరణించకపోయిన మాకు స్వేచ్ఛనిచ్చావు. మేము నిన్నెలా కీర్తించగలము! దైవసాక్షిగా ఈ భవనపు గోడలు నీకు కృతజ్ఞతలు చెప్తున్నాయి. - సిసెరో

ఎవరి  వ్యక్తిత్వం విలువకట్టలేనిదో అతడు చచ్చిపడివున్నాడు. అనారోగ్యంవల్ల కాదు, వయసు వల్ల కాదు. యుద్ధం వల్ల కాదు, దేవుడి కోరికపై కాదు. ఏ విదేశీయ శత్రువు గాయపరచలేని అతడు సహచరులచే చంపబడ్డాడు. అతడు ఎవరినైతే జాలితలచి వదవేశాడో వారే!

ఎక్కడ నువ్వు సీజర్‌? మానవులపై నీకున్న దయ ఎక్కడుంది? నీ జీవిత త్యాగఫలం ఎక్కడ? నీవు చేసిన చట్టాలు ఎక్కడ? ఇక్కడ ప్రజామైదానంలో ఎక్కడైతే విజయగర్వంతో ప్రజల హర్షధ్వానాల మధ్య నడిచావో! ఏ వేదికపై నుండి నీవు ప్రజలనుద్ధేశించి మాట్లాడావో! ఇక్కడే హతవిధీ! నీ మెరిసే జుట్టు రక్తంతో నిండి వుంది. ఈ హత్యకు పాల్పడినవారు విదేశీశత్రువులు కాదే వీరు అతడి దయపై జీవిస్తున్నవారే. - ఆంటోని 

Write a review

Note: HTML is not translated!
Bad           Good